వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 2020 సంవత్సరానికి సంబంధించి ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
వ్యవసాయ రంగంలో..
వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డి (chintala venkat reddy) పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చింతల హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ రైతు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్రమోదీ సైతం మన్‌కీబాత్‌లో అభినందించారు. సంప్రదాయ పద్ధతుల్లో వెంకట్‌రెడ్డి చేస్తున్న సేద్యాన్ని గుర్తించిన కేంద్రం వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ప్రకటించింది.
ఇదీ చూడండి:హైదరాబాద్ రైతు వెంకట్‌రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు