హుజూరాబాద్ కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి(koushik reddy) తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. కౌశిక్‌తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు.
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ.. హుజూరాబాద్ తెరాస టికెట్ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజయేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు.
కాంగ్రెస్‌కు రాజీనామా
ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో కాంగ్రెస్ కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
చేరికలు