తెలంగాణ

telangana

ETV Bharat / state

Koushik Reddy: 'ఈటలది స్వార్థ రాజకీయం... నాది సంక్షేమ మార్గం' - హుజూరాబాద్​ వార్తలు

Koushik Reddy
కౌశిక్​ రెడ్డి

By

Published : Jul 20, 2021, 10:29 AM IST

Updated : Jul 20, 2021, 2:05 PM IST

10:23 July 20

Koushik Reddy: తెరాస గూటికి కౌశిక్​ రెడ్డి.. రేపే చేరిక

Koushik Reddy: తెరాస గూటికి కౌశిక్​ రెడ్డి.. రేపే చేరిక

హుజూరాబాద్ అభివృద్ధి కోసం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కౌశిక్​ రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్​లో సీఎం సమక్షంలో తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. పెద్దఎత్తున తరలిరావాలని తన అభిమానులను కోరారు. సీఎం కేసీఆర్ కృషితో హుజూరాబాద్‌ రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం, ఎల్‌ఎండీ జలాలతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారని ప్రశంసించారు. 

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారని కౌశిక్​ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఈటల సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు. ప్రజా సమస్యల కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేయలేదని.. స్వలాభం కోసమే రాజీనామా చేశారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలతో తెరాసకు రాజీనామా చేసి ఆత్మగౌరవం అంటూ నినాదాలు చేయడం సరికాదని అన్నారు. ఈ రెండేళ్లు తెరాసకు అవకాశం ఇవ్వాలని... చెప్పిన అభివృద్ధి జరగకపోతే మళ్లీ ఓటు అడగమని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనని నమ్మించి గొంతుకోశారని.. హుజూరాబాద్ ఉపఎన్నికపై ఎన్నిసార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదని చెప్పారు. హుజురాబాద్ తెరాస అభ్యర్థిగా మీరే బరిలో ఉంటారా అన్న ప్రశ్నకు కౌశిక్ రెడ్డి సమాధానం దాటవేశారు. 

'రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం సమక్షంలో తెరాసలో చేరుతున్నా. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కేసీఆర్​.. పేదలకు అండగా నిలుస్తున్నారు. దళిత బంధు పథకం అమలుకు ఫైలెట్​ ప్రాజెక్టుగా హుజూరాబాద్​ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నా. రైతు బంధు కూడా హుజూరాబాద్​ నుంచే మొదలైంది. 

-కౌశిక్​ రెడ్డి

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్​ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్​లో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని..  ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజయేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు. ఈ ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో కాంగ్రెస్​ కౌశిక్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో కౌశిక్​ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.  

ఇదీ చదవండి:JEE: జేఈఈ మెయిన్​ మూడో విడత ఆన్​లైన్​ పరీక్షలు ప్రారంభం

Last Updated : Jul 20, 2021, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details