ప్రభుత్వ ఉద్యోగులకు ప్యాకేజీ - వేతన సవరణ
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజి కింద ఇచ్చే యోచన ప్రభుత్వం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పీఆర్సీ నివేదిక వచ్చిన తరువాత మధ్యంతర భృతి కాకుండా నేరుగా వేతన సవరణ అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆలోచన జరుగుతోందన్నారు. రైతు రుణమాఫీ హామీ అమలుపై 15 రోజుల్లో నిబంధనలు వెల్లడిస్తామని వివరించారు. నిరుద్యోగ భృతి అమలుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందని చెప్పారు. అవి సిద్ధమయ్యాక వివరాలు చెబుతామన్నారు.
ఇదీచూడండి: నేడు శాసనసభలో పద్దుపై చర్చ