తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్​పీఐ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పబ్బతి శ్రీకృష్ణ నామినేషన్​ - తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు

రిపబ్లికన్​ పార్టీ ఆఫ్ ఇండియాకు పూర్వ వైభవం రాబోతోందని హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Pabbati Srikrishna nominated as MLC candidate on behalf of Republic party of india
ఆర్​పీఐ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పబ్బతి శ్రీకృష్ణ నామినేషన్​

By

Published : Feb 23, 2021, 5:33 PM IST

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రిపబ్లికన్​ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పబ్బతి శ్రీకృష్ణ పోటీచేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్​లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో పని చేసిన రిపబ్లికన్​ పార్టీకి ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పని చేసిన వారున్నారని శ్రీకృష్ణ తెలిపారు. పార్టీకి పూర్వవైభవం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కుటిల రాజకీయాలను నమ్మకూడదన్న ఆయన పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

ABOUT THE AUTHOR

...view details