కరోనా రెండోదశ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అవసరమైన ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రాణవాయువును తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే సనత్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఇవాళ 75 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 5 ఆక్సిజన్ ట్యాంకర్లను రవాణా శాఖ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రంలోని అంగూల్‌కు పంపించారు.
ప్రాణవాయువు కోసం ఒడిశా రాష్ట్రానికి ఆక్సిజన్ ట్యాంకర్లు - Oxygen tankers to Odisha
రాష్ట్రంలో అవసరమైన ఆక్సిజన్ నిల్వలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 5 ఆక్సిజన్ ట్యాంకర్లను సనత్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఒడిశా రాష్ట్రానికి పంపింది. 75 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లను పంపించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఒడిశా రాష్ట్రానికి ఆక్సిజన్ ట్యాంకర్లు
కంప్రెసర్, జనరేటర్, ఆటోమేటిక్ మెకానికల్, న్యూమాటిక్ పరికరాలను పంపించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. వీటికి అదనంగా రెండు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకర్లను ఐఏఎఫ్ విమానం ద్వారా ఒడిశాకు పంపించామన్నారు. ఈ ట్యాంకర్లకు జీపీఎస్‌ను అమర్చామని.. వీటి ద్వారా అవి వచ్చేప్పుడు ఎలా వస్తున్నాయో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని రవాణా శాఖ వెల్లడించింది.