మేఘా (Megha) ఇంజినీరింగ్ కంపెనీ- మెయిల్ సామాజిక బాధ్యత కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తోన్న మరో మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ (Oxgen) ట్యాంకర్లు హైదరాబాద్ చేరుకున్నాయి. మొదటి విడతలో మూడు ట్యాంకర్లు రాగా... తాజాగా థాయ్ లాండ్ నుంచి మరో మూడు ట్యాంకర్లను దిగుమతి చేసుకున్నారు. ఛండీగఢ్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లిన భారత వైమానికదళ విమానం అక్కణ్నుంచి ట్యాంకర్లను హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చింది.
Oxgen tanks: హైదరాబాద్‌కు చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు - Telangana news
హైదరాబాద్ కు మరో మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ (Oxgen) ట్యాంకర్లు చేరుకున్నాయి. మేఘా (Megha) ఇంజినీరింగ్ కంపెనీ- మెయిల్ సామాజిక బాధ్యత కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ట్యాంకర్లు చేరుకున్నాయి.
oxgen
ఈ క్రయోజనిక్ ట్యాంకుల ద్వారా ఇతర రాష్ట్రాల్లోని ఆక్సిజన్ (Oxgen) ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకొచ్చి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేస్తాయి. ఒక్కో ట్యాంకర్ ద్వారా కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయవచ్చు.