తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన ఆక్సిజన్​ ట్యాంకర్ - Hyderabad latest news

ఒడిశా నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ సాంకేతిక సమస్యతో రహదారిపై నిలిచిపోయింది. బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ సమీపంలో ట్యాంకర్​కు సంబంధించిన... లారీ కమాన్ పట్టీలు విరిగి పోవడంతో ఒక్కసారిగా వాహనం అక్కడికక్కడే ఆగిపోయింది.

oxygen tanker stopped on the road
రోడ్డుపై నిలిచిపోయిన ఆక్సిజన్​ ట్యాంకర్

By

Published : May 12, 2021, 2:01 PM IST

సాంకేతిక సమస్య కారణంగా ఆక్సిజన్​ తరలిస్తున్న ట్యాంకర్​ బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ సమీపంలో నిలిచిపోయింది. ఒడిశా నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న ట్యాంకర్​కు సంబంధించిన లారీ కమాన్​ పట్టీలు విరిగి పోయాయి. దాంతో ఒక్కసారిగా వాహనం అక్కడికక్కడే ఆగిపోయింది.

సమాచారం అందుకున్న బోయిన్​పల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. లారీ సిబ్బందితో కలిసి వాహనానికి మరమ్మతులను ప్రారంభించారు. వీలైనంత త్వరగా ట్యాంకర్​ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు గంటపాటు వాహనం నిలిచిపోయింది.

రోడ్డుపై నిలిచిపోయిన ఆక్సిజన్​ ట్యాంకర్

ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'

ABOUT THE AUTHOR

...view details