కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ట్యాంకర్‌ను బేగంపేట్ విమానాశ్రయం నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా పంపించారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్‌ను తీసుకొచ్చారు.
'గాంధీ'కి తరలించేందుకు ట్రాఫిక్ ఆపేశారు - గ్రీన్ ఛానెల్ ద్వారా గాంధీ ఆస్పత్రికి ఆక్సిజన్ ట్యాంకర్
హైదరాబాద్ ట్రాఫిక్‌తో ఎలాంటి అటంకాలు లేకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా గాంధీ ఆస్పత్రికి ఆక్సిజన్ ట్యాంకర్‌ను తరలించారు పోలీసులు. కొవిడ్ బాధితులకు అందించేందుకు ఒడిశా నుంచి వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్ సికింద్రాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి రాగా.. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
!['గాంధీ'కి తరలించేందుకు ట్రాఫిక్ ఆపేశారు Oxygen tanker moved from begumpet air port to gandhi hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11637427-280-11637427-1620122758562.jpg)
గ్రీన్ ఛానెల్ ద్వారా ఆక్సిజన్ తరలించిన పోలీసులు
నగర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రహదారిపై ట్యాంకర్ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా... ఆస్పత్రికి వేగంగా చేరేలా వ్యవహరించారు.