తెలంగాణ

telangana

ETV Bharat / state

కీలక భేటీ.. ఇవాళ కార్మిక సంఘాలతో ఈడీల సమావేశం - ts rtc strike issue

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఈడీల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈడీల కమిటీ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కీలక భేటీ.. ఇవాళ కార్మిక సంఘాలతో ఈడీల సమావేశం

By

Published : Oct 26, 2019, 7:54 AM IST

Updated : Oct 26, 2019, 8:25 AM IST

కీలక భేటీ.. ఇవాళ కార్మిక సంఘాలతో ఈడీల భేటీ!

ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ ఇవాళ చర్చలు జరపనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం దాదాపు నాలుగు గంటల పాటు ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు తదితరులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమస్యలపై రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీల కమిటీని నియమించగా.. ఆ కమిటీ అధ్యయనం చేసి తమ నివేదికను సంస్థ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మకు శుక్రవారం ఉదయం సమర్పించింది. దానిని ఆయన రవాణామంత్రికి అందజేశారు. మంత్రి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు దానిని సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈడీల కమిటీ నివేదిక, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారం లేని అంశాలపై సంఘాలతో చర్చలు జరపాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Last Updated : Oct 26, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details