తమ సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సుల యజమానులు బస్ భవన్ ముట్టడికి దిగారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 25 శాతం మాత్రమే నడుపుతున్న బస్సులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బస్ భవన్‌ను ముట్టడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అద్దె బస్సుల యజమానులు నిరసనలో పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానుల డిమాండ్ - హైదరాబాద్ వార్తలు
బకాయిలు చెల్లించాలి: అద్దె బస్సుల యజమానులు
10:29 September 21
బకాయిలు చెల్లించాలని అద్దె బస్సుల యజమానుల డిమాండ్
రూ.130కోట్ల బకాయిలు రావాలి..
జిల్లాల నుంచి వస్తున్న క్రమంలో చాలా మందిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. కష్టకాలంలో అద్దె బస్సులను నడిపిస్తే వాటికి చెల్లించాల్సిన బకాయిలు ఆరు నెలలైనా విడుదల చేయలేదన్నారు. రూ. 130 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. అద్దె బస్సులపై 15 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. వారు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు.
ఇదీ చదవండి:మృత్యు కుహరాలుగా మారుతున్న నాలాలు
Last Updated : Sep 21, 2020, 12:46 PM IST