కొవిడ్-19ను ఎదుర్కోవడానికి దేశంలో విధించిన లాక్‌డౌన్ రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వలస కూలీలను ఆదుకోవడానికి ఉపశమన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం కింద దేశం మొత్తాన్నీ ప్రభుత్వం లాక్‌డౌన్ పరిధిలోకి తీసుకురాజాలదు. ఇది సమాఖ్యవాదానికి విరుద్ధం. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు విప్పడం లేదో నాకు అర్థం కావడంలేదు’’