తెలంగాణ

telangana

ETV Bharat / state

Flyover Inauguration: ఒవైసీ, మిధాని కూడళ్లలో ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Owaisi Midhani Flyover Inauguration: హైదరాబాద్​ నగర శిఖలో మరో పై వంతెన చేరింది. ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద రూ.63 కోట్లతో నిర్మించిన ఒవైసీ-మిధాని కూడలి పైవంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 12 మీటర్ల వెడల్పుతో 3 వరుసలుగా పైవంతెన నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా ఇది పనిచేయనుంది.

Owaisi Midhani Flyover Inauguration
ఓవైసీ, మిధాని కూడళ్లలో ఫ్లై ఓవర్‌

By

Published : Dec 28, 2021, 11:53 AM IST

Updated : Dec 28, 2021, 12:38 PM IST

Owaisi Midhani Flyover Inauguration: విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరానికి… అంతే స్థాయిలో మౌలికవసతులు, అభివృద్ధి హంగులు అద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించటమే కాక… పైవంతనెలు, అండర్ పాస్‌ల నిర్మాణంతో పలు ప్రాంతాల రూపురేఖల్నే మారుస్తోంది. అటువంటి మరో కలికితురాయి హైదరాబాద్ నగర సిగలో చేరింది.

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఒవైసీ, మిధాని జంక్షన్లలో… నిర్మాణమైన పైవంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ ఒవైసీ పాల్గొన్నారు. ఎస్​ఆర్​డీపీలో భాగంగా రూ.63 కోట్లతో మూడు వరుసలతో.. 1.3 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ వంతెనతో మిధాని-డీఎంఆర్​ఎల్​ కూడళ్ల మధ్య వాహనాల రద్దీ తగ్గే అవకాశముంది. మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు... ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ద్వారా చాంద్రాయణగుట్ట - కర్మాన్‌ఘాట్ మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

ఇదీ చూడండి:owaisi midhani flyover : ఒవైసీ, మిధాని కూడళ్లలో తీరనున్న ట్రాఫిక్‌ చిక్కులు

Last Updated : Dec 28, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details