హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన - latest news in Hyderabad
11:23 December 09
హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన
హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పర్యటిస్తున్నారు. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థను బృందం సందర్శించనుంది. కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. దేశంలో కరోనా టీకాల పురోగతిని విదేశీ ప్రతినిధులు తెలుసుకోనున్నారు. రాయబారుల పర్యటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా టీకాల పురోగతిని తెలుసుకోనున్నారు. శామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీకి రాయబారుల బృందాలు వెళ్లనున్నాయి.
కాసేపట్లో భారత్ బయోటెక్‌ను విదేశీ ప్రతినిధులు సందర్శించనున్నారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను విదేశీ ప్రతినిధులు తిలకించనున్నారు. సౌకర్యాలను పరిశీలించి శాస్త్రవేత్తలతో భేటీకానున్నారు. బయోలాజికల్-ఇ సంస్థను మరో బృందం సందర్శించనుంది. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించనుంది.