జీవో నంబర్ 60తో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అన్యాయం చేసిందంటూ.... నిలోఫర్ ఆసుపత్రి పొరుగు సేవల సిబ్బంది ఆందోళన చేపట్టారు. సదరు జీవో ప్రతులను చింపి, కాల్చి వేశారు. 15 ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్నా... తమను పర్మినెంట్ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది' - neelofer hospital latest news
15ఏళ్ల నుంచి పని చేస్తున్నా తమను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పర్మినెంట్ చేయలేదని హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 60 ద్వారా సర్కారు మరోసారి తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిలోఫర్ ఆసుపత్రి వద్ద సిబ్బంది ధర్నా
కరోనా మహమ్మారి సమయంలో పని చేస్తున్నా తమకు కూడా అన్యాయం జరుగుతోందని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 60ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ప్రకటించారు..
ఇదీ చదవండి:వైద్య సిబ్బంది నిర్లక్ష్యం... విలవిల్లాడుతూ వృద్ధుడు మృత్యువాత