తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరాపార్క్​ వద్ద ఔట్​డోర్ అడ్వర్టైజింగ్ మీడియా ఆందోళన - Telangana news

68 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఇందిరాపార్కు వద్ద ఔట్​డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షమంది ఉపాధి కోల్పోతున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరాపార్క్​ వద్ద ఔట్​డోర్ అడ్వర్టైజింగ్ మీడియా ఆందోళన
ఇందిరాపార్క్​ వద్ద ఔట్​డోర్ అడ్వర్టైజింగ్ మీడియా ఆందోళన

By

Published : Dec 23, 2020, 12:23 PM IST

హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఔట్​డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 68 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలో 350 కంపెనీలు మూతపడే ప్రమాదముందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లో తొమ్మిది నెలలుగా హోర్డింగ్​ సంస్థలు మూతపడ్డాయి. గ్రేటర్​లో హోర్డింగ్ ఇండస్ట్రీకి నెలకు రూ. 8 వేల కోట్ల మేర నష్టపోతున్నట్లు అంచనా వేశారు. సేవ్ హోర్డింగ్ ఇండస్ట్రీ అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

ABOUT THE AUTHOR

...view details