దిశ ఘటనపై కేసును వేగంగా దర్యాప్తు జరిపి నిందితులకు తక్షణమే శిక్ష పడేలా చొరవ తీసుకోవాలని తెలుగు నటీనటుల సంఘం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి కోరారు.
దిశ ఘటనపై గవర్నర్‌ను కలిసిన 'మా' సంఘ ప్రతినిధులు - Rapid probe into the incident and immediate punishment for the accused
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తెలుగు నటీనటుల సంఘం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కలిసి విజ్ఞప్తి చేశారు.
దిశ ఘటనపై గవర్నర్‌ను కలిసిన మా సంఘం
తెలుగు నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ , ఉపాధ్యక్షురాలు హేమతోపాటు మా సభ్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై తమ ఆవేదనను వివరించారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్