రాష్టంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి, సేవలపై ఆరాతీశారు. రోగుల తాకిడికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈటల రాజేందర్ నిమ్స్ పర్యటన
By
Published : Mar 1, 2019, 6:18 PM IST
ఈటల రాజేందర్ నిమ్స్ పర్యటన
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. వివిధ విభాగాలు, రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన నిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైందని.. అందుకు తగిన విధంగా అన్ని విభాగాలను విస్తరిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ లో మార్పులు చేస్తామని.. ఔట్ సోర్సింగ్, ఒప్పంద ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. రోగులకు సంతృప్తికరమైన సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.