రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని... ఓయూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని అన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు.
'రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి' - హైదరాబాద్ తాజా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని... ఓయూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
ఉద్యోగులకు పెంచిన వయో పరిమితిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
ఇదీ చదవండి: 'కేసీఆర్ను దూషిస్తే మీకే పాపం తగులుతుంది'