తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థులు, పోలీసుల వాగ్వాదం - RTC strike in telangana

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ విద్యార్థులు  చేపట్టిన ప్రగతిభవన్​ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ఓయూ విద్యార్థుల అరెస్ట్​

By

Published : Oct 17, 2019, 12:35 PM IST

13 రోజులుగా ఉద్ధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు మద్దతు పెరుగుతోంది. సమ్మెకు మద్దతుగా ప్రగతిభవన్​ ముట్టిడికి బలయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, టీఎస్‌యూ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్​ చేశారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడాన్ని విద్యార్థులు ఖండించారు. కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారణమన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details