తెరాస తీరును నిరసిస్తూ ఓయూలో రాస్తారోకో - ou
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకుని కేసీఆర్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తెరాస పాల్పడుతున్న విధానాలకు వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన తెలిపారు.
'ప్రజాస్వామ్యాన్ని తెరాస కూనీ చేస్తోంది'
తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కళాశాల ముందు ముఖానికి నల్ల దుస్తులు ధరించి భారీ ర్యాలీ చేశారు. ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తెరాస సర్కారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.