విద్యార్థుల పట్ల కనీసం కనికరం లేకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ ఓయూ విద్యార్థులు ఆరోపించారు. ఓయూలో మానేరు, గోదావరి వసతి గృహాల్లో నీళ్లు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. రిజిస్ట్రార్ వచ్చి సమస్యను పరిష్కరించేలా హామీ ఇవ్వకపోతే నిరసన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల నిరసనతో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి.
నీటికోసం రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు - నీటికోసం రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు
ఓయూలో నీటి కష్టాలు విద్యార్థులను రోడ్డు మీదకు తీసుకొచ్చాయి. వసతి గృహాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రిజిస్టార్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నీటికోసం రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు