తెలంగాణ

telangana

ETV Bharat / state

OU Students Protest: బస్సులో నుంచి దిగి ప్రగతిభవన్‌ వైపు పరుగెత్తి! - OU Students News

OU Students Protest: ప్రగతిభవన్‌ వద్ద ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసు ఉద్యోగాల గరిష్ఠ వయసును పెంచాలని డిమాండ్ చేస్తూ వారంతా నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకుని గోషామహల్‌కు తరలించారు.

Protest
Protest

By

Published : Apr 30, 2022, 5:31 PM IST

OU Students Protest: ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ బస్సులో నుంచి దిగిన దాదాపు 20 మంది విద్యార్థులు ఒక్కసారిగా ప్రగతి భవన్ ప్రధాన ద్వారంవైపు పరుగెత్తారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. వారిని ముందుకు వెళ్లనీయకుండా నిలువరించారు. యూనిఫాం ఉద్యోగాల్లో గరిష్ఠ వయసుకు మరికొంత మినహాయింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

ప్రభుత్వం సకాలంలో పోలీసు, అబ్కారీ, జైళ్లు, అగ్నిమాపక శాఖలో నోటిఫికేషన్లు వేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు వయసు దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫాం ఉద్యోగం కోసం కొన్నేళ్లుగా చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మిహాయింపును 3 ఏళ్లు కాకుండా మరికొంత పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకొని గోషామహల్ మైదానానికి తరలించారు.

బస్సులో నుంచి దిగి ప్రగతిభవన్‌ వైపు పరిగెత్తి!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details