తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి అవస్థలు తాళలేక.. రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు - Ou_Student_Protest_On_Water

తమ వసతి గృహాల్లో  సరిగా నీరు రావట్లేదని ఓయూలోని విద్యార్థులు ధర్నా చేపట్టారు. గత ఐదు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి అవస్థలు తాళలేక.. రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు

By

Published : Apr 18, 2019, 8:43 AM IST

రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం రాత్రి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. యూనివర్సిటీలోని డీ హాస్టల్ విద్యార్థులు తమకు సరిగా నీరు రావట్లేదని న్యాయ కళాశాల ముందు ధర్నాకు దిగారు. గత ఐదు రోజులుగా ఓయూలోని డీ1, ఈ2, డీ, బీఈడీ వసతిగృహాల్లో తాగునీరు, వాడుకునే నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండకాలం వచ్చిందంటే హాస్టల్​లో నీటి కొరత వేధిస్తోందని.... తమ సమస్యను పట్టించుకునే వారే లేరని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

యూనివర్సిటీ సిబ్బంది, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న వైస్ ప్రిన్సిపాల్ నీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి: గుప్త నిధులు కావవి... రాగి నాణేలు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details