పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలను డిసెంబరులో నిర్వహించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, లైబ్రరీ సైన్స్ కోర్సులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఈ నెల 19లోగా ఫీజు చెల్లించవచ్చని... ఆలస్య రుసుముతో 24 వరకు గడువుందని ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
ఓయూ పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల - హైదరాబాద్ సమాచారం
పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. పీజీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌తో పాటు మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలను డిసెంబరులో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చని ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
ఓయూ పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
పీజీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌తోపాటు మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పరీక్ష కాలవ్యవధిని రెండు గంటలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.