బడ్జెట్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.వంద కోట్లు కేటాయించాలంటూ ఓయూ న్యాయ కళాశాల విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్యకేసులో నిందితులను శిక్షించాలంటూ ధర్నా చేశారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఓయూ లా కళాశాల విద్యార్థులు - తెలంగాణ తాజా వార్తలు
అసెంబ్లీ ముట్టడికి ఓయూ లా కళాశాల విద్యార్థులు యత్నించారు. బడ్జెట్‌లో ఓయూకు రూ.వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వామన్‌రావు దంపతుల హత్యకేసులో నిందితులను శిక్షించాలని కోరారు. అసెంబ్లీ వైపునకు దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఓయూ లా కళాశాల విద్యార్థులు
అసెంబ్లీ వైపునకు దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం న్యాయ కళాశాల విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి