తెలంగాణ

telangana

ETV Bharat / state

వసతి గృహం.. సమస్యల నిలయం - వసతి గృహ సమస్యలు

ఎన్నో లక్ష్యాలతో చదువుకునేందుకు వేలమంది ఉస్మానియా తలుపుతడతారు. కష్టపడి ప్రవేశ పరీక్ష రాసి సీటు సంపాదించుకుంటారు. ఉన్నత ఆశయంతో విశ్వవిద్యాలయ మెట్లెక్కిన అమ్మాయిలకు వసతిగృహంలో సమస్యలు వెంటాడుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలంటూ అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.

ఉస్మానియా విద్యాలయం

By

Published : Mar 13, 2019, 9:28 AM IST

ఆందోళన చేస్తున్న విద్యార్థినులు
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం లేడీస్​ హాస్టల్​లో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. రాత్రివేళల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని కళాశాల నుంచి వసతి గృహానికి వెళ్లాలంటేనే భయంగా ఉందని వాపోయారు. సెక్యూరిటీ గార్డులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భయం భయంగా..

రాత్రి సమయాల్లో విద్యుద్దీపాలు లేకపోవడం వల్ల భయం భయంగా ఉంటోందని విద్యార్థినులు చెబుతున్నారు. వసతి గృహ పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయని సరైన భద్రత ఏర్పాట్లు లేవని ఆరోపించారు.

సర్దిచెప్పిన పోలీసులు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులకు నచ్చచెప్పారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి :జూబ్లీహిల్స్​లో హత్య.. ప్రశ్నించడమే కారణం..

ABOUT THE AUTHOR

...view details