బిగ్ బాస్ రియాలిటీ షోను తక్షణం నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస నాయకులు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. షో పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై మహిళలు రోడ్లపైకి వస్తుంటే సంబంధిత టీవీ ఛానల్, హీరో నాగార్జున స్పందించకపోవడం దారుణమన్నారు. అసభ్యకరమైన సన్నివేశాలు లేవని ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంబంధిత కార్యాలయాన్ని, హీరో నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
బిగ్బాస్ షోపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు - మానవ హక్కుల సంఘం
బిగ్బాస్ షోను తక్షణం నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస నేతలు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. రియాలిటీ షోలో అసభ్యకర సన్నివేశాలు లేవని ప్రజలకు వివరణ ఇవ్వాలని లేకుంటే సంబంధిత కార్యాలయాన్ని, హీరో నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
బిగ్ బాస్ షోపై మానవ హక్కుల సంఘానికి ఓయా జేఏసీ ఫిర్యాదు