హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసేందుకు వచ్చిన తెలంగాణ నిరుద్యోగ, ఓయూ ఐకాస నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గెజిటెడ్ ఉద్యోగుల సర్వీసు పొడిగింపును నిరసిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పర్శతో అపవిత్రమైందంటూ గన్‌పార్క్ అమరవీరుల స్థూపాన్ని పసుపుతో శుద్ధి చేసేందుకు వచ్చిన వారిని సైఫాబాద్ పోలీసులు అడ్డుకున్నారు.
ఓయూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతల అరెస్టు - police arrested ou jac leaders
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పర్శతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసేందుకు వచ్చిన నాయకులను పోలీసులను అరెస్టు చేశారు. గెజిటెడ్ ఉద్యోగుల సర్వీసు పొడిగించడంపై నాయకులు మండిపడ్డారు.
గన్‌పార్క్ వైపు దూసుకెళ్లేందుకు వెళ్లిన ఐకాస నాయకులు కూటూరి మానవతారాయ్, కొప్పుల ప్రతాప్ రెడ్డి తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత భర్త పదవిని రెండేళ్లు పొడిగించడంపై ఐకాస నాయకులు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని... లేనిపక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఐకాస నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఓయూ భూములపై గవర్నర్‌ను కలిసిన కోదండరాం, చాడ