తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ విద్యార్థి నేతకు అరుదైన గౌరవం! - ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతకు అరుదైన గౌరవం లభించింది. అర్జెంటీనాకు చెందిన క్రిస్టియానా ప్రమోటర్స్​ డిఫెండర్స్​కు విద్యార్థి నేత గడ్డం అశోక్​ పీస్​ అంబాసిడర్​గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతలు అశోక్​ను అభినందించారు.

Ou Jac Leader Appointed as Peace Ambassador  christiana promoters Defenders
ఓయూ విద్యార్థి నేతకు అరుదైన గౌరవం!

By

Published : Aug 29, 2020, 10:40 AM IST

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత గడ్డం అశోక్​కు అరుదైన గౌరవం దక్కింది. అర్జెంటీనా దేశానికి చెందిన క్రిస్టియానా ప్రమోటర్స్​ డిఫెండర్స్​కు పీస్​ అంబాసిడర్​గా నియమితులయ్యారు. తనను పీస్​ అంబాసిడర్​గా నియమించిన వరల్డ్​ క్రిస్టియానా అసోసియేషన్​కు అశోక్​ ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపకులు వినోద్​ కుమార్​, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల, ఓయూ విద్యార్థి నేత బాలాజీ, తదితరులు అశోక్​ను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details