తెలంగాణ

telangana

ETV Bharat / state

Osmania University: పీహెచ్‌డీ పూర్తయిందా.. హాస్టల్‌ ఖాళీ చెయ్‌

Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. పీహెచ్‌డీ సమర్పణ గడువు ముగిసిన విద్యార్థులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పలువురికి నోటీసులు జారీ చేసింది.

Osmania University: పీహెచ్‌డీ పూర్తయిందా.. హాస్టల్‌ ఖాళీ చెయ్‌
Osmania University: పీహెచ్‌డీ పూర్తయిందా.. హాస్టల్‌ ఖాళీ చెయ్‌

By

Published : May 19, 2022, 11:20 AM IST

Osmania University: పీహెచ్‌డీ సమర్పణ గడువు ముగిసిన విద్యార్థులను ఖాళీ చేయించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. అనుమతి లేకుండా హాస్టళ్లలో ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసింది. 2017 కంటే ముందు పీహెచ్‌డీ ప్రవేశాలు తీసుకున్న విద్యార్థుల గడువు ఇప్పటికే ముగిసింది. గత నెల 13 వరకు వన్‌టైమ్‌ ఛాన్స్‌ కింద అవకాశం ఇవ్వగా.. దాదాపు 1,240 మంది విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఇలా పీహెచ్‌డీ కోర్సు ముగిసినప్పటికీ.. ఇంకా 300 మంది వరకు హాస్టళ్లలో నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.

వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులకు ఓల్డ్‌ పీజీ, న్యూ పీజీ, ఎన్‌ఆర్‌ఎస్‌, డి హాస్టళ్లు ఉన్నాయి. గడువు ముగిసినా.. హాస్టళ్లలోనే కొనసాగుతుండటంతో మెస్‌, ఇతరత్రా సదుపాయాల పరంగా వర్సిటీపై భారం పడుతోంది. కొత్త విద్యార్థులకు గదులు కేటాయించే పరిస్థితి లేదు. 2017 తర్వాత కొత్తగా ప్రవేశాలు జరగలేదు. కేవలం కేటగిరీ-1 కింద ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీరికి హాస్టల్‌ వసతి కల్పించడం ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల 2017 కంటే ముందు ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులందరూ హాస్టళ్లను ఖాళీ చేయాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ తాఖీదులు జారీ చేశారు.

కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే..: కొర్రెముల శ్రీనివాస్‌, చీఫ్‌ వార్డెన్‌, ఓయూ
పీహెచ్‌డీ ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు వర్సిటీలో వసతి లేక బయట ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చాం. మానవతా దృక్పథంతో ఆలోచించి అభ్యర్థులు హాస్టళ్లను విడిచివెళ్లాలి.

ABOUT THE AUTHOR

...view details