తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్​.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి - ఆస్తి పన్ను బకాయిల వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఓటీఎస్​ పథకం వార్తలు

ఆస్తి పన్ను బకాయిల వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ అనే వినూత్న​ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ పథకం అమలులో ఉండనుంది.

OTS scheme for property tax arrears
ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్​.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి

By

Published : Jul 28, 2020, 8:26 PM IST

గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను బకాయిల వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. బకాయిదారులకు మరో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయి మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ చెలిస్తే.. మిగతా 90 శాతం వడ్డీని మాఫీ చేయనున్నారు. ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ వన్ టైం సెటిల్మెంట్ పథకం అమల్లో ఉండనుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే రూ.1477 కోట్ల రూపాయల వరకు ఆస్తిపన్ను బకాయిలు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details