సైబర్‌నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. బ్యాంకు అధికారులమంటూ సుమారు 7 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో జరిగింది. గోల్కొండకు చెందిన ఈషాక్ అనే మహిళ ఓటీపీ చెప్పగానే అకౌంట్ నుంచి 5 లక్షలు డబ్బులు విత్‌డ్రా అయ్యాయి.
ఓటీపీ, క్యూఆర్‌లతో 7 లక్షల వరకు కాజేసిన సైబర్‌నేరగాళ్లు - సైబర్‌నేరగాళ్ల ఆగడాలు
ఆన్‌లైన్‌లో నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో బ్యాంకు అధికారులమంటూ సుమారు 7 లక్షల వరకు కాజేశారు. ఓటీపీ, క్యూఆర్ కోడ్లతో డబ్బులు స్వాహా చేశారు.
ఓటీపీ, క్యూఆర్‌లతో 7 లక్షల వరకు కాజేసిన సైబర్‌నేరగాళ్లు
ఇదే తరహాలో నల్లగుట్ట బేగంపేటకు చెందిన కమలేశ్ అనే వ్యక్తి నుంచి ఓటీపీ ద్వారా 70 వేలను ఆన్‌లైన్ దొంగలు కాజేశారు. కరోనా కోసం సీఎం సహాయనిధికి ఆన్‌లైన్‌లో 10వేలు బదిలీ చేయగా డబ్బులు కట్ కాకపోవడం వల్ల వేణుగోపాల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేశాడు. అదే అదనుగా క్యూఆర్ కోడ్ పంపించి రూ. లక్ష కొట్టేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!