తెలంగాణ నుంచి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. దీనికోసం కార్మికుల వివరాలను పోలీసు స్టేషన్లలో నమోదు చేసుకుంటున్నారు. నేడు అబిడ్స్ పోలీసు స్టేషన్లో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా వలస కూలీలు వచ్చారు. రాష్ట్రంలో ఎంత మంది వలస కార్మికులు ఉన్నారో తెలుసుకొని వారిని సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
వలస కూలీల వివరాలను సేకరిస్తోన్న ప్రభుత్వం - corona virus
స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలసకూలీల వివరాలను తెలంగాణ సర్కారు సేకరిస్తోంది. దీనికోసం కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్లలో నమోదు చేసుకుంటున్నారు. ఈ వివరాలతో కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించే అవకాశం ఉంది.
వలస కూలీల వివరాలను సేకరిస్తోన్న ప్రభుత్వం
సేకరించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రైళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లటానికి ఏర్పాట్లు జరిగినట్లయితే వారికి సమాచారం అందించేందుకు ఈ వివరాలు ఉపయోగపడనున్నాయి.
ఇవీ చూడండి: వలస కార్మికుల రాళ్లదాడి- బాష్పవాయువు ప్రయోగం