తెలంగాణ

telangana

ETV Bharat / state

'వీసీల నియామకంలో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం'

యూనివర్సిటీ వీసీల నియామకంలో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్​దేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా నియమితులైన రవీందర్ యాదవ్​ను అభినందించారు.

osmania university, osmania university vc ravinder yadav
ఉస్మానియా వర్సిటీ, ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్ యాదవ్

By

Published : May 25, 2021, 5:06 PM IST

యూనివర్సిటీ వైస్​ఛాన్సలర్​ల నియామకంలో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్​గా నియమితులైన రవీందర్ యాదవ్.. మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీసీ రవీందర్ యాదవ్​ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో ఎంతో ఉన్నతమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి యాదవ సామాజిక వర్గానికి చెందిన రవీందర్ యాదవ్​ను నియమించినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్.. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచితం స్థానం కల్పిస్తూ అభివృద్దికి తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీకి మరింత గుర్తింపును తీసుకురావాలని తలసాని... వీసీ రవీందర్ యాదవ్​ను కోరారు.

ABOUT THE AUTHOR

...view details