తెలంగాణ

telangana

ETV Bharat / state

యూనివర్సిటీల్లో విద్యార్థులను హింసించడం అమానుషం - police behavior on university students

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన యూనివర్సిటీల్లో విద్యార్థులపై పోలీసులు దాడికి దిగడాన్ని ఓయూ విద్యార్థులు ఖండించారు.

osmania university students protest against of police behavior on university students
యూనివర్సిటీల్లో విద్యార్థులను హింసించడం అమానుషం

By

Published : Dec 17, 2019, 1:18 PM IST

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టిన యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడికి దిగడం అమానుషమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన నిర్వహించారు. జామియా, అలీగడ్ యూనివర్సిటీల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా వెళ్లిన పోలీసులు విద్యార్థులను హింసించడాన్ని ఖండించారు.

యూనివర్సిటీల్లో విద్యార్థులను హింసించడం అమానుషం
దేశ అభివృద్ధి, భవిష్యత్తుకు సంబంధించిన చట్టాలు, పాలసీలపై స్పందించే హక్కు, బాధ్యత విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై ఉంటుందని... వారి హక్కులను కాలరాయవద్దని చెప్పారు. పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details