ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మె విరమించేలా చేయాలని ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వీరిని బలవంతంగా అరెస్టు చేసి ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు తాము ఉద్యమిస్తూనే ఉంటామని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీ చేస్తున్న ఓయూ విద్యార్థుల అరెస్ట్ - OU students rally in support of RTC workers
ఆర్టీసీ సమ్మె కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
![ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీ చేస్తున్న ఓయూ విద్యార్థుల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4763918-thumbnail-3x2-ou.jpg)
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీ చేస్తున్న ఓయూ విద్యార్థుల అరెస్ట్
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీ చేస్తున్న ఓయూ విద్యార్థుల అరెస్ట్
Last Updated : Oct 15, 2019, 10:57 PM IST