కరోనా వంటి ప్రమాదకర వైరస్ విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లోనూ... జర్నలిస్టులు వార్తలు సేకరిస్తూ ప్రజల్ని జాగృతం చేస్తున్నారని ఓయూ జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రాజు అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తోన్న వారికి... ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని కోరారు.
జర్నలిస్టులకు ఓయూ జేఏసీ ఛైర్మన్ చేయూత - groceries to tarnaka journalists
కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లో ప్రజలను జాగృతం చేయడానికి ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న జర్నలిస్టులకు తెరాస నేత, ఓయూ జేఏసీ ఛైర్మన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. వారికి చేయూతనివ్వడానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![జర్నలిస్టులకు ఓయూ జేఏసీ ఛైర్మన్ చేయూత ou jac distributed groceries to journalists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6907790-387-6907790-1587633734634.jpg)
జర్నలిస్టులకు ఓయూ జేఏసీ ఛైర్మన్ చేయూత
ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓయూలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా తమ గ్రామాలకు చెందిన పేదలకు సాయపడాలని, సీఎం నిధికి విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.