తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఓయూలో విద్యార్థుల ధర్నా

కొవిడ్​ -19 ప్రభావం అన్నీ రంగాలపై పడుతోంది. వ్యాపార సంస్థల నుంచి మొదలుకొని విద్యాసంస్థల వరకు ఈ వైరస్​ ప్రభావానికి గజగజా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓయూ హాస్టల్​ వసతిగృహాన్ని యాజమాన్యం మూసివేసింది. దీనిని పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.

By

Published : Mar 18, 2020, 5:27 AM IST

Updated : Mar 18, 2020, 7:38 AM IST

Osmania Students Strike for To renovate the dormitory
కరోనా ఎఫెక్ట్: ఓయూలో విద్యార్థుల ధర్నా

ఓయూ హాస్టళ్లలో విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇందుకోసం ఓయూ రోడ్లు దిగ్బంధం చేయటంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది. కొవిడ్ - 19తో ఉస్మానియాలోని వసతి గృహాలను ఖాళీ చేయాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయినా విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయకపోవటం వల్ల విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు.

అసహనానికి గురైన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. చీకట్లో మగ్గుతోన్న తమ గోడు ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

Last Updated : Mar 18, 2020, 7:38 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details