తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ భూములను రక్షించాలని నిరసన దీక్ష - OU_NIRASANA_DEEKSHA

వందేళ్ల ఓయూ భూములను పరిరక్షించి, ఆ భూములపై కన్నేసిన కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని పరిశోధక విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్​ ఛైర్మన్​ చనగాని దయాకర్​ నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణలోని అన్ని వర్సిటీలకు పర్మినెంట్​గా వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.

osmania student protest to protect ou lands in hyderabad
ఓయూ భూములను రక్షించాలని నిరసన దీక్ష

By

Published : Jun 2, 2020, 4:42 PM IST

యూనివర్సిటీలపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో పరిశోధక విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణలోని ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు పర్మినెంట్​గా వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.

వందేళ్ల ఓయూ భూములను పరిరక్షించాలని, ఓయూ భూములపై కన్నేసిన కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దయాకర్ అన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇవీ చూడండి: జగన్​ జల దోపిడీకి కేసీఆర్​ అండ: రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details