తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్​ సహా విద్యార్థుల అరెస్ట్​ - ou students arrest

హైదరాబాద్​ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగ్రఫీ విద్యార్థి నరసయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. అంతవరకు మృతదేహాన్ని తరలించవద్దంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.​ వీరికి వీహెచ్ మద్దతు తెలిపారు.

student Suspicious death in osmania university hostel
ఓయూ వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి

By

Published : Feb 17, 2020, 6:19 PM IST

హైదరాబాద్​ ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ వసతిగృహం వద్ద విషాదం చోటుచేసుకుంది. జాగ్రఫీ విద్యార్థి నరసయ్య రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. బాధితులకు న్యాయం చేయాలంటూ వసతి గృహం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత వీరికి మద్దతు తెలిపారు. రిజిస్ట్రార్​ వచ్చి హామీ ఇచ్చేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు విద్యార్థులు అంగీకరించలేదు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల.. వీహెచ్​ సహా ఆందోళన చేస్తున్న విద్యార్థులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్​ సహా విద్యార్థుల అరెస్ట్​

ఇవీచూడండి:వివాహేతర సంబంధం.. కడతేర్చిన ప్రియుడు

ABOUT THE AUTHOR

...view details