శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అరకొర వసతులతో విద్యార్థినిలు నెట్టుకొస్తున్నారు. ఏకంగా వసతిగృహంలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి... కత్తితో విద్యార్థినిని బెదిరించి చరవాణి అపహరించుకుపోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయని వారు వాపోయారు. వీరి ఆందోళనకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొనడం వల్ల ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఒక దశలో విశ్వవిద్యాలయం అధికారులకు విద్యార్థినిలకు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకుంది. ప్రహరీ గోడ ఎత్తు పెంచడమే కాకుండా... వసతిగృహం వెలుపల సీసీ కెమారాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి వసతిగృహం వద్దకు చేరుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం వల్ల వారు ఆందోళన విరమించారు.
ప్రహరీ గోడ నేటికీ పూర్తికాలేదు;
ఉస్మానియాలో విద్యార్థినిలకు రక్షణ ఏది..? - students protest
విద్యార్థినిల వసతి గృహాల్లో రక్షణ కరువవుతోంది. సరైన భద్రత లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పట్లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థినుల వసతి గృహంలోపలికి ఆగంతకుడు ప్రవేశించి ఓ విద్యార్థినిని కత్తితో బెదిరించడం... ఆమె చరవాణి లాక్కొని పారిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు, పలు విద్యార్థి సంఘాలు వసతి గృహం ఎదుట ఆందోళనకు దిగారు. రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
1987లో నిర్మించిన వసతి గృహం ప్రహరీ గోడ నేటికీ పూర్తికాకుండా అసంపూర్తిగా మిగిలి ఉంది. కొందరు స్థానికులు ప్రహరీని కూల్చివేసి విశ్వవిద్యాలయంలోకి రాకపోకలు సాగించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. యూనివర్సిటీ పరిసరాల్లో సుమారు 3వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. దీనికి తోడు విశ్వవిద్యాలయంలో ప్రైవేటు వాహనాలు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిపై నిషేధం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడ వీధి దీపాలు కూడా సరిగా వెలగడం లేదని చెప్పారు.
ఇవీ చూడండి:బంగారు తెలంగాణ కాదు...బకాయిల తెలంగాణ