ఉస్మానియా జూనియర్ వైద్యులు సమ్మె విరమించారు. ఈ నెల 9న ఆసుపత్రిలో తగినన్ని ఆపరేషన్ థియేటర్లు, ఆక్సిజన్ సదుపాయంతో కూడిన పోస్ట్ ఆపరేటివ్ కేర్ వార్డులు అందుబాటులో లేవంటూ జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన జూడాలు సమ్మెకు దిగారు.
సమ్మె విరమించిన ఉస్మానియా ఆసుపత్రి జూడాలు
ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. జూడాలతో సూపరింటెండెంట్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం వల్ల సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
సమ్మె విరమించిన ఉస్మానియా ఆసుపత్రి జూడాలు
నాలుగు రోజులుగా జరుగుతున్న సమ్మెపై జూడాలతో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర జరిపిన చర్చలు ఫలించాయి. ఈ నెల 19 లోపు తగినన్ని ఆపరేషన్ థియేటర్లు సహా అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు సూపరింటెండెంట్ హామీ ఇవ్వడం వల్ల సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. తక్షణం విధుల్లో చేరుతునట్టు వెల్లడించారు.
ఇవీచూడండి:ఉస్మానియాలో ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు కోసం జూడాల ధర్నా