గగన్‌పహాడ్‌కి చెందిన 17 ఏళ్ల యువతి కడుపు నొప్పితో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో(Osmania Hospital) చేరింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగుల్లో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించి కడుపులోంచి 2 కిలోల బరువున్న వెంట్రుకల ముద్దను తొలగించి... అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. వెంట్రుకలు కడుపులో పేరుకుపోవటం సాధారణ సమస్యే అని వైద్యులు తెలిపారు.
Rare surgery: బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకల ముద్ద గుర్తింపు
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను (Rare surgery) విజయవంతంగా పూర్తిచేశారు. గగన్‌పహాడ్‌కి చెందిన 17 ఏళ్ల యువతి కడుపు నొప్పితో బాధపడుతుంగా... పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగుల్లో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపులోంచి 2 కిలోల బరువున్న వెంట్రుకల ముద్దను తొలగించారు.
బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకలు
కానీ... చిన్న పేగులు, జీర్ణాశయంలోనూ వెంట్రుకలు నిలచిపోవటం చాలా అరుదైన విషయంగా పేర్కొన్నారు. ఈ నెల 2న పూజితకు శస్త్రచికిత్స నిర్వహించిన ఉస్మానియా వైద్యులు... బాధితురాలు ఆరోగ్యంగా ఉన్నందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహాలో ఇప్పటి వరకు 68 కేసులు మాత్రమే గుర్తించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి: షర్మిలకు చుక్కెదురు.. కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..!