గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం టెక్నాలజీ కళాశాల ఉద్యోగి మృతి చెందాడు. కొన్ని సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో అతను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. విధులకు హాజరయ్యే పరిస్థితి లేకపోయినప్పటికీ లాక్డౌన్ నేపథ్యంలో అతన్ని విధులకు హాజరు కావలసిందిగా ఓయూ యాజమాన్యం ఒత్తిడికి గురి చేసిందని వారు ఆరోపించారు. రెండురోజుల క్రితం అతను ఉప్పుగూడలోనే తన ఇంటి వద్ద బీపీ పెరిగి కింద పడిపోయినట్లు తెలిపారు. వెంటనే అతన్ని ఉస్మానియాకు తరలించగా కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు.
కరోనాతో ఓయూ ఉద్యోగి మృతి.. యూనివర్సిటీ బంద్ - ఉస్మానియా విశ్వవిద్యాలయం తాజా వార్త
కరోనాతో ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ ఉద్యోగి మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ యాజమాన్యం ఒత్తిడితో అతను విధులకు హజరయ్యాడని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
కరోనాతో ఓయూ ఉద్యోగి మృతి
14 రోజుల పాటు ఉద్యోగులను, యూనివర్సిటీని పూర్తిగా బంద్ చేసి శానిటేషన్ చేయాలని వారు కోరారు. తమకు భద్రత కల్పించండంటూ ఓయూ రిజిస్ట్రార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి:గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి