Minister Harish Rao on Medical equipments: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఇమాముద్దీన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాధిపతి రమేశ్.. హైదరాబాద్ అరణ్యభవన్‌లో మంత్రి హరీశ్ రావును కలిశారు. అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి మంత్రికి వివరించారు.
అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం: హరీశ్ రావు - Minister Harish Rao on Medical equipments
Minister Harish Rao on Medical equipments: అత్యాధునిక వైద్య పరికరాలతో ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే ప్రజారోగ్యం కోసం సీఎం కేసీఆర్.. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావును కలిసిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.. అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి వివరించారు.
మంత్రి హరీశ్ రావు
గత 15 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన క్యాథ్‌ల్యాబ్ వల్ల ఇప్పటి వరకు 50 కరోనరీ అంజియోగ్రామ్, 3 ఫ్లూరోస్కోపీ వంటి చికిత్సలు అందించినట్లు వైద్యులు మంత్రికి వివరించారు. అంతేకాకుండా గత నెలలో 4 తుంటి మార్పిడి, 2 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు మంత్రికి తెలిపారు. ప్రజలకు అందిస్తున్న చికిత్సలను తెలుసుకున్న మంత్రి.. ఉస్మానియా వైద్యులను అభినందించారు.
ఇదీ చదవండి:Revanth reddy: 'కేంద్రంలోని భాజపా 317 జీవోను ఎందుకు కొట్టివేయలేదు'