తెలంగాణ

telangana

ETV Bharat / state

Osmania building:'ఉస్మానియా భవనం ఆసుపత్రికి పనికి రాదు' - హైకోర్టు తాజా వార్తలు

'ఉస్మానియా భవనం ఆసుపత్రికి పనికి రాదు'
'ఉస్మానియా భవనం ఆసుపత్రికి పనికి రాదు'

By

Published : Jul 22, 2022, 8:01 PM IST

Updated : Jul 22, 2022, 10:11 PM IST

19:58 July 22

'ఉస్మానియా భవనం ఆసుపత్రికి పనికి రాదు'

Osmania building: ఉస్మానియా భవనం సురక్షితం కాదని, ఆసుపత్రికి పనికిరాదని నిపుణుల కమిటీ తేల్చింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆసుపత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది. వారసత్వ కట్టడం కాబట్టీ ఉస్మానియా భవనానికి ఆర్కిటెక్ట్‌ పర్యవేక్షణలో మరమ్మతులు చేయవచ్చని సూచించింది. అయితే, ఆసుపత్రిగా వాడుకోవాలంటే ఆక్సిజన్‌, మంచినీరు, సివరేజీ, గ్యాస్‌పైప్‌లైన్ల వంటి పనులు అవసరం ఉంటుందని పేర్కొంది. అలాంటి మరమ్మతులు చేస్తే భవనం హెరిటేజ్‌, నిర్మాణ పటిష్టత దెబ్బతింటుందని తెలిపింది.

మరమ్మతులు చేసి ఆసుపత్రియేతర అవసరాలకు వినియోగించవచ్చని నిపుణుల కమిటీ వెల్లడించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చి కొత్తగా నిర్మించాలని కొందరు, వారసత్వ కట్టడం కాబట్టీ కూల్చవద్దని మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా ఆసుపత్రి భవనం పరిశీలనకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ప్రజారోగ్యశాఖల ఈఎన్సీలు, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌తో పాటు ఎన్‌ఐటీ, ఐఐటీ, ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం భవన నిర్మాణాన్ని అధ్యయనం చేసింది.

నిపుణుల కమిటీ నివేదికను అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ఇవాళ హైకోర్టుకు సమర్పించారు. కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం తెలిపేందుకు కొంత గడువు కావాలని సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నంద ధర్మాసనాన్ని ఏజీ కోరారు. నివేదికను పిటిషనర్లు కూడా అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేపడతామన్న హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 25కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్​..

భూమి కోసం ఒకరు.. భాష కోసం మరొకరు.. ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన

Last Updated : Jul 22, 2022, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details