వేగంగా.. సురక్షితంగా.. ప్రజలకు చేరువగా అనే నినాదంతో ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలను విస్తరిస్తోంది. రైతులు, కళాకారులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ సేవలు అందించేందుకు జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ ప్రత్యేకాధికారి కృష్ణకాంత్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మరో వారం, పది రోజుల్లో ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామంటున్న ఆర్టీసీ ఓఎస్డీ కృష్ణకాంత్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఆర్టీసీ కార్గోను ఆదరించండి: ఓఎస్డీ కృష్ణకాంత్ - తెలంగాణ తాజా వార్తలు
ఆర్టీసీ కార్గోను ఆదరించాలని ప్రత్యేకాధికారి కృష్ణకాంత్.. ప్రజలను కోరారు. అతి తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హోం డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఆయన.. ఆన్లైన్ సేవల ప్రారంభంతో ప్రజలకు మరింత చేరువవుతామని ధీమావ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్గోను ఆదరించండి: ఓఎస్డీ కృష్ణకాంత్