అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్(ORR) నిర్వహణ అదే స్థాయిలో ఉండేందుకు హెచ్‌ఎండీఏ(HMDA) ప్రణాళికలు రూపొందిస్తోంది. రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రధాన రహదారి, సర్వీసు రోడ్లను శుభ్రం చేసే బాధ్యత ఏజెన్సీలదే. ప్యాకేజీ-1లో పెద్ద అంబర్‌పేట నుంచి శంషాబాద్ ఇంటర్‌ఛేంజ్ వరకు, ప్యాకేజీ-2లో గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరు వరకు విభజించారు. ఇందుకు టెండర్లు పిలిచారు. ఈనెల 15వ తేదీ వరకూ దాఖలుకు అవకాశం ఇచ్చారు.
ఏడాదిలోపే రూపుమారింది
ఏడాదిలోపే ఓఆర్‌ఆర్ రూపుమారింది. హెచ్‌జీసీఎల్(Hyderabad Growth Corridor Limited) బృందం హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టింది. అన్ని ఇంటర్‌ఛేంజ్‌లు, మీడియన్లతో పాటు రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ పకడ్బందీగా చేయడంతో అంతటా పచ్చదనం పరుచుకుంది.