తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయస్థానాల్లో 478 పోస్టులు మంజూరు - కోర్టు పోస్టుల రిక్రూట్‌మెంట్ 2021

వివిధ న్యాయస్థానాల్లో కొత్త పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పోస్కో కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన కోర్టులకు 60 పోస్టులు మంజూరయ్యాయి. మల్కాజిగిరి, కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన న్యాయస్థానాలకు 78 నూతన పోస్టులను మంజూరు చేశారు.

orders-released-for-new-posts-will-recruit-in-various-courts-in-telangana
న్యాయస్థానాల్లో కొత్త పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ ‌సిగ్నల్

By

Published : Mar 15, 2021, 8:52 PM IST

రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాలకు కొత్త పోస్టులు మంజూరయ్యాయి. పెద్దపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా న్యాయస్థానానికి 31 పోస్టులు... హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పోస్కో కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన కోర్టులకు 60 పోస్టులు మంజూరు చేశారు. మల్కాజిగిరి, కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన న్యాయస్థానాలకు 78, ఇబ్రహీంపట్నం కోర్టుకు 26 పోస్టులు మంజూరు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, నారాయణపేట, కొల్లాపూర్, మహబూబ్‌నగర్, వనపర్తి కోర్టులకు 200 పోస్టులు మంజూరయ్యాయి. కొత్తగా ఏర్పాటైన గోదావరిఖని కోర్టుకు 26, ధర్మపురి న్యాయస్థానానికి 28, సిటీ సివిల్ కోర్టుకు 29 పోస్టులను మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు

ABOUT THE AUTHOR

...view details